రేపే 09/06/2025, సాయంత్రం 6 గంటలకు ప్రారంభం..
అష్ట సిద్ధులు, నవనిధులు, దశ మహావిద్యలు, ఏకాదశ పీఠాలు, ఇలా యంత్ర, మంత్ర, తంత్ర నిగూఢమైనవెన్నో ఎన్నెన్నో.. శోధించి సాధిస్తే ఒసగే మహా శక్తులెన్నో.. అష్టసిద్ధి యంత్రానికి అపచారం జరిగితే ఎదురయ్యే దుర్ఘటనలు సామాన్యమైనవా..? 400 ఏళ్ల క్రితం జరిగిన ఆ తప్పిదం ఏంటి? ఇన్నేళ్ల తరువాత అది ఏలా సరిదిద్దబడింది? ఆ యంత్రాన్ని సాధించి, తరతరాలుగా జరుగుతున్న మహాపచారాన్ని రూపుమాపేందుకు ఓ యువకుడు సల్పిన పోరాటమే, మధుబాబు గారి అద్భుత సృష్టి, 'చక్రతీర్థం' కథా మూలం..
రణ తంత్రాలు, వ్యూహ రచనలు, ఎత్తుకు పై ఎత్తులు, మాయోపాయాలతో నిండి ఉన్నదే తంత్రం.. మంత్రబలం నుండైనా, యంత్రబలం నుండైనా తప్పించుకోవచ్చేమో కానీ, తంత్రం నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమార గారడీ విద్యలతో కూడిన ఆ తాంత్రిక ప్రపంచంలో అమోఘమైన, నిగూఢమైన తంత్రశాస్త్రాన్ని అభ్యసించిన వారికే తెలుస్తుంది 'చక్రతీర్థం'లోని మర్మం.. ఆ మర్మమేమిటో, అందులోని మాయ ఏమిటో తెలుసుకోవాలంటే.. మన 'చక్రతీర్థం' ఆడియోబుక్ సిరీస్ లోని ఏ భాగాన్నీ మిస్ అవ్వకండి.. మీ అభిప్రాయాలను ప్రతి వీడియోలో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను.. మహీధర్
Playlist: https://www.youtube.com/playlist?list=PLH8sKIJ0wgDej48VxaCTIm7KO_VnWN09K