SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Saturday, April 30, 2022

జ్ఞాపకాలు! Memories


జ్ఞాపకాలు!

నేను వ్రాసిన షాడో నవలలు పాఠకులను ఆకర్షించి, ఆ పుస్తకాలకు డిమాండ్ పెరగటంతో, ఆ నవలల్ని తమ పబ్లికేషన్స్ కు కూడా వ్రాయమని అడిగారు, చాలామంది పబ్లిషర్స్.. చాలా కాలం నాటి మాట ఇది..

నా టాలంట్ ని గుర్తించి, నన్ను అమితంగా ప్రోత్సహించిన  యం.వీ.యస్. వారికి పోటీగా, వెరే వారి దగ్గిర్నించి నా నవలలు రావటం ఇష్టం లేక, అప్పుడు వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ తిరస్కరించాను.

తమ మాటల్ని కాదన్నానన్న కచ్చతో, నాకు డూప్లికేట్స్ ని సృష్టించారు ఆ పబ్లిషర్స్.

'షాడో'కున్న డిమాండ్ ని తాము కూడా ఎంజాయ్ చేయటానికి, రక రకాల ప్రయత్నాలు  చేశారు.

షాడో  నాకు పేరు తెచ్చి పెట్టాడు గానీ ఆర్ధికంగా సహాయ పడలేదు ఆ రోజుల్లో..

నేను ఏమీ చేయలేని పరిస్తితి. కానీ, షాడో అభిమానులు మాత్రం చాలా సీరియస్ అయిపోయారు. ఆ పబ్లిషర్స్ దగ్గిరికి స్వయంగా పోయి, తమ నిరసనను వ్యక్తం చేశారని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది.

ఏం చెప్పారో ఎలా చెప్పారోగానీ, మటుమాయం అయిపోయారు 'డూప్లికేట్ మధుబాబు'లు.

ఈ మధ్య డూప్లికేట్స్ రాలేదుగానీ,  యూట్యూబులో నా పుస్తకాలను ఆడియో బుక్స్ రూపంలో పబ్లిష్ చేయటం మొదలు పెట్టారు చాలా మంది. ఓపిక పట్టాను. వద్దని కామెంట్లు కూడా వారి చానెల్స్ లో పెట్టాను. ఎవరూ వినిపించుకోలేదు. వినిపించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నట్టు తమ దండ యాత్రని కొనసాగిస్తున్నారు.

మరోసారి షాడో అభిమానులకు చురుక్కుమన్నది. టెక్నాలజీ మీద పట్టున్న వాళ్ళు అందరూ నడుంబిగించారు. ఒకటొకటిగా మాయం అయిపోతున్నాయి  ఆచానెల్స్. ఇక ముందు కూడా అవుతాయి.

అనుమతి లేకుండా షాడోని వాడుకున్నా.. మధుబాబు పేరును వుపయోగించినా, వదిలి పెట్టటం జరగదని చెపుతున్నారు.

అయితే ఆడియో బుక్స్ ని పబ్లిష్ చేసేందుకు, నేను మూడు సంస్థలకు అనుమతిని ఇచ్చాను.

'గానా డాట్ కాం' వారికి రెండు.. 'బుక్ వేద' వారికి అయిదు... 'స్టొరీ టెల్' వారికి ఇరవై నవలలు ఆడియో బుక్స్ గా వేయడానికి Permission ఇచ్చ్చాను..

ఈ మూడు చానెల్స్ లో నేను అనుమతి ఇచ్చిన నవలలూ, మిగిలినవి నా అఫిషియల్ చానెల్ లోనూ తప్ప, ఇంక ఏ చానెల్ లోనూ, నా రచనలైన షాడో నవలలు గానీ, జానపదాలు గానీ, సొషియో క్రైం నవలలు గానీ రావు..

నన్ను అభిమానించి, ఎంతగానో సహాయ పడుతున్న అభిమానులకు ఈ వివరాలను అందచేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.

అనుమతి లేకుండా నా రచనల్ని వుపయోగించుకుంటున్న వారి వివరాల్ని నాకు పంపిస్తున్న షాడో లవర్స్ కి నా హృదయపూర్వక నమస్సులు..  - మధుబాబు

Friday, April 29, 2022

భోళాశంకర్ Part 5 Bholashankar Novel SMBAB

భోళాశంకర్ నవల | Bholashankar Novel written by Madhu Babu | Audiobook / Podcast Part 5 | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


FACEBOOK Video Link

Thursday, April 28, 2022

'షాడో వ్యక్తిగత జీవితం' మధుబాబు గారి మాటల్లో.. Part 4 of 4..

 

'షాడో వ్యక్తిగత జీవితం' మధుబాబు గారి మాటల్లో.. Part 4 of 4..

రాజుకు ఉద్యోగం ఇచ్చినందుకు ప్రతిఫలంగా, కంపెనీ యజమాని తనను ఆశిస్తున్నట్లు భర్తకు చెపుతుంది లలిత. బాధపడుతుంది. నిద్రపోకుండా ఆ రోజు రాత్రి ఆ భార్యాభర్తలు ఇద్దరూ తర్జన భర్జనలు పడటాన్ని గమనించలేకపోతాడు రాజు.

తన స్నేహితుడి జీవితాన్ని తీర్చిదిద్దటంకోసం, అతను సమాజపు అవహేళనకు బలైపోకుండా రక్షించటంకోసం, ఏ భర్తా తీసుకోని నిర్ణయాన్ని తీసుకుంటాడు వేణు. కంపెనీ యజమాని కోరికను అంగీకరించమని లలితకు చెపుతాడు.

తోడబుట్టిన సోదరుడికంటే ఎక్కువైన రాజు కోసం తన శీలాన్ని పణంగా పెడుతుంది లలిత. కంపెనీ యజమాని నీచపు బుద్ధికి లొంగిపోతుంది. క్షణ క్షణానికీ మారుతూ వుండే ఈ సమాజపు రాక్షస ప్రవృతిని అంచనా వేయటంలో తప్పటడుగు వేశారు ఆ దంపతులు.

లలిత మానాన్ని దోచుకుని, ఒక దొంగకు తన కంపెనీలో ఉద్యోగం ఎలా ఇవ్వగలనని అంటాడు ఆ దుర్మార్గుడు.

కంగుతిన్న లలిత ఎదురు తిరిగి నిలవేసే సరికి, పదిమంది రౌడీలను పిలిచి ఆమెను అప్పగిస్తాడు. ఆలోచించే శక్తిని కోల్పోతుంది లలిత. బాధపడటం కూడా మరిచిపోతుంది.

సూటిగా ఇంటికి వచ్చి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. డ్యూటీనుంచి తిరిగివచ్చి ఆమె శవాన్ని చూస్తాడు వేణు. జరిగిందేమిటో వూహించి, పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేస్తాడు.

కంపెనీ యజమాని ధన బలం ముందు తల వంచుతుంది న్యాయం. రిపోర్టు ఇవ్వటానికి వచ్చిన వేణును లాకప్ లోకి నెట్టి, విరగ దీస్తారు పోలీసులు. అచేతనంగా పడిపోయిన అతడిని రైలు కట్ట మీదికి దొర్లిస్తారు. స్పృహలేని స్థితిలో నుంచి బయట పడకుండానే
ప్రాణాలు వదిలేస్తాడు వేణు.

తను నమ్మిన నీతికోసం, తన స్నేహితుడి కోసం భార్య ప్రాణాలనూ, తన ప్రాణాలనూ బలి ఇస్తాడు.

మనశ్శాంతి కోసం ఊరి బయటికి పోయి, చీకటి పడిన తర్వాత తిరిగి వచ్చిన రాజుకు తెలుస్తుంది ఆ విషయం.

అంతవరకూ అతన్ని పట్టి వుంచిన స్నేహబంధం తెగిపోయింది. రక్తాన్ని కోరే రాక్షసుడిలా, పట్టరాని బాధతో గుండెలు మండి పోతుండగా, నిప్పులు కక్కుతూ పోయి, కంపెనీ యజమాని ఇంటి మీద పడతాడు. అడ్డు వచ్చిన వారందర్నీ పిడికిటి పోట్లకు గురిచేసి,
ఆ ఇంటిని ఆగ్నికి ఆహుతి ఇస్తాడు.

రాజు ఆవేశాన్ని చూసి భయపడి పారి పోతాడు కంపెనీ యజమాని. మద్రాసు నగరాన్ని విడిచి ఎటో వెళ్ళిపోతాడు. అతని కోసం వెతుకుతూ కడుపు నింపుకోవటం కోసం దొంగ అయ్యాడు రాజు. సమాజం మీది కక్షతో గజదొంగ అయ్యాడు.

నీడనైనా పట్టుకోవచ్చుగానీ, రాజును పట్టుకోవటం కష్టమనే అభిప్రాయం అందరిలోనూ బలపడి, అదే అతని పేరు అయింది.

'షాడో'గా నామకరణం జరిగింది. రాజు 'షాడో'గా మారటానికి వెనుక గల విషాద గాథ ఇది.. మానవత్వాన్ని మరచి, అతను ఒక్కోసారి రాక్షసుడిలా ప్రవర్తించటానికి గల కారణం కూడా ఇదే..

ఈ విషయాలన్నీ వివరంగా గతంలో వచ్చిన నా షాడో పాస్ట్ లైఫ్ సిరీస్ లో వివరించ బడ్డాయి.. పుస్తకరూపంలో వున్న వాటిని తిరిగి సవివరంగా రాయటం అనవసరం అనే వుద్దేశ్యంతో, ఇక ముగిస్తున్నాను. అభినందనలతో.. -మధుబాబు

సేకరణ: శ్రీకాంత్ రెడ్డి ముత్తారెడ్డి


Tuesday, April 26, 2022

'షాడో వ్యక్తిగత జీవితం' మధుబాబు గారి మాటల్లో.. Part 3 of 4..

 

'షాడో వ్యక్తిగత జీవితం' మధుబాబు గారి మాటల్లో.. Part 3 of 4..

"ఎవరో ఏదో అన్నారని, అలాగే చేయటం మంచి పద్ధతి కాదు. ధైర్యం వుంటే సమస్యల్ని పరిష్కరించుకునేందుకు మార్గాలు అవే కనిపిస్తాయి..." అంటూ తన మెడలో వున్న గొలుసును షాడోకి ఇస్తుంది లలిత. ఇష్టంలేకపోయినా దాన్ని తీసుకు పోయి, డబ్బు తీసుకువస్తాడు రాజు. తల్లిదండ్రులకు దహన సంస్కారాలు చేస్తాడు.

మార్వాడీ సేటుకు ఇంటిని అప్పచెప్పి, నిలువ నీడ కూడా కోల్పోయిన అతన్ని తమ ఇంటికి తీసుకుపోతారు, వేణు-లలిత. అక్కడే వుండి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తాడు రాజు.

కానీ, దొంగతనం చేసి జైలు పాలయిన వారిని నమ్మి, ఎవరు ఇస్తారు ఉద్యోగం? అందరూ దొంగ-దొంగ అని  వెక్కిరిస్తుంటే వినలేక కుమిలిపోతున్న రాజును ఊరడించి, ధైర్యాన్ని చెపుతారు ఆ దంపతులు. రాజుకూ తనకూ అక్రమ సంబంధం అంట గట్టి, చెవులు కొరుక్కుంటున్న ఇరుగు పొరుగు వారి మాటల్ని తేలికగా కొట్టి పారేస్తుంది లలిత.

"నీకు నాకు వున్న సంబంధం ఏమిటో నేను పూజించే దేవతలకు తెలుసు. నన్ను కట్టుకున్న నా దేముడికి తెలుసు. ఈ లోకుల మాటల్ని నేను కేర్ చెయ్యను..." అంటుంది. అలాగే ప్రవర్తిస్తుంది.

తిరగగా తిరగగా రాజు కథను విన్న ఒక దయా మయుడు, తన కంపెనీలో ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరిస్తాడు. మర్నాడు పది గంటలకల్లా ఆఫీసుకు రమ్మని చెపుతాడు. ఆనందంతో ఆ రాత్రి రాజుకు నిద్రపట్టదు. తన జీవితం బాగుపడి నట్లే అని అతను భావిస్తున్న సమయంలో, తెల్లవారుజామునే వచ్చి అతన్ని స్టేషన్ కి లాక్కుపోతారు, పోలీసులు. పక్క వీధిలో ఏదో దొంగతనం జరిగిందట! పాత దొంగ కాబట్టి, ఆ పని రాజే చేసి వుండచ్చు గదా!!
 
తనకేమీ తెలియదని గోల చేసినా వినిపించుకోకుండా, లాకప్ లో పడవేసి పదకొండు గంటలదాకా విరగబాది వదులుతారు పోలీసులు. పదకొండు గంటల సమయంలో వారికి తెలుస్తుంది, అసలు విషయం. దొంగ తనం చేసింది తన కుటుంబ సభ్యులేనని, ఇచ్చిన రిపోర్టును ఉపసంహరించుకుంటాడు ప్రక్క వీధి పెద్ద మనిషి.

అనవసరంగా అనుమానించటమే కాకుండా, అంతవరకూ చిత్ర హింసలు పెట్టిన విషయాన్ని విస్మరించి, బుద్ధిగా బ్రతకమని ఒక వార్నింగ్ తో రాజును వదిలేస్తారు పోలీసులు. పరుగు పరుగున పోతాడు రాజు. ఉద్యోగం ఇస్తానని చెప్పిన మహనీయుడి ఆఫీసుకు.
అతని కంటె ముందుగానే పోతుందక్కడికి అతని దురదృష్టం. అంతవరకూ ఎదురు చూసి చూసి, అప్పుడే కంపెనీ పనుల మీద ఫారిన్ వెళ్ళి పోతాడాయన. నిరాశా నిస్పృహలతో ఇంటికి వచ్చిన రాజును, మళ్ళీ ఊరడిస్తుంది లలిత.

తను పనిచేసే కంపెనీలో ఉద్యోగం ఇప్పించడం కోసం యజమానిని కలుసుకుంటుంది. ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరిస్తాడు యజమాని. ప్రతిఫలంగా లలిత శీలాన్ని కోరతాడు.

మళ్ళీ కలుద్దాం.. -మధుబాబు

సేకరణ: శ్రీకాంత్ రెడ్డి ముత్తారెడ్డి


భోళాశంకర్ నవల | Bholashankar Novel written by Madhu Babu | Audiobook / Podcast Part 3

భోళాశంకర్ నవల | Bholashankar Novel written by Madhu Babu | Audiobook / Podcast Part 3 | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


Facebook Link

Sunday, April 24, 2022

'షాడో వ్యక్తిగత జీవితం' మధుబాబు గారి మాటల్లో.. Part 2 of 4..


'షాడో వ్యక్తిగత జీవితం' మధుబాబు గారి మాటల్లో.. Part 2 of 4..

తీరని దు:ఖంతో కుమిలిపోతున్న రాజును ఓదార్చేందుకు ఆ చుట్లుపట్ల నివసించేవారు ఎవరూ రాకపోయినా, ఆ వార్త తెలిసిన మరు క్షణం రెక్కలు కట్టుకుని వచ్చేస్తారు వేణు, లలిత.

రాజుకు బాల్య స్నేహితుడు వేణు. లలిత అతని అర్ధాంగి. తల్లడిల్లిపోతున్న రాజును ఓదార్చి, ధైర్యాన్ని చెపుతారు వారిద్దరూ. ఆ తరువాత జరుగవలసిన పనుల్ని కానీయమని బోధిస్తారు.

జైల్లో కూలి పనులు చేసినందుకు, రాజుకు కొంత డబ్బు ఇస్తుంది ప్రభుత్వం. ఆ డబ్బుతో తల్లిదండ్రుల అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేయడానికి, సిద్ధ పడతాడతను. అదే సమయంలో, పది మంది రౌడీలను వెంటబెట్టుకుని అక్కడికి వస్తాడు, ఒక పెద్ద మనిషి.

రాజు జైల్లో వుండగా, అతని తల్లిదండ్రులకు కొంత డబ్బు అప్పు ఇచ్చి, ఇంటిని తాకట్టు పెట్టించుకుంటాడు. ఇప్పుడు ఆ బాకీ తీర్చమని బలవంతం చేస్తాడు. కొద్దిపాటి టైమ్ అడుగుతాడు రాజు.

తన వద్ద డబ్బు లేదని చెబుతాడు. అతని చేతిలోని నోట్లను చూపించి, అవేమిటని ప్రశ్నిస్తాడు, ఆ పెద్దమనిషి.

ఆ కొద్దిపాటి డబ్బుతో అతని అప్పు తీరదు.. అయినా ఆ సొమ్మును కాస్తా అతని పరం చేస్తే, అంత్య క్రియలు చేయడం ఎలా??

ఆ విషయమే అతనితో చెప్పి, బ్రతిమాలుకుంటాడు రాజు.

"కూటికి ఠికాణా లేని వాళ్ళకు అంత్య క్రియలేమిటి? మున్సిపాలిటీ వారికి మూడు రూపాయలు ఇస్తే, తీసుకు పోయి అవతల పారేయరా." అంటాడా పెద్ద మనిషి.

భగ్గుమంటుంది రాజు గుండె. పిచ్చి ఆవేశంతో అతని షర్టును పట్టుకుంటాడు. అందు కోసమే ఎదురు చూస్తుంటారు, పెద్ద మనిషి వెంట వచ్చిన రౌడీలు. రాజును  చితక కొట్టి, ఆ డబ్బుతో మాయం అవుతారు. ఇరవై నాలుగు గంటల్లో ఇంటిని తన పరం చేయాలని అల్టిమేటమ్ జారీ చేసి వెళ్ళి పోతాడు, పెద్ద మనిషి.

ఎంతో మంది చూస్తారు ఆ దృశ్యాన్ని. ముందుకు వచ్చి ఇదేమిటని అడిగిన వాళ్లు వారిలో ఎవరూ వుండరు.

తల్లి దండ్రుల దహన సంస్కారాలకు కూడా డబ్బు లేకుండా పోవడంతో, బండబారి పోతుంది రాజు గుండె. తనను దొంగ అని అపనింద వేసింది సంఘం.
 
దొంగగానే చూస్తూ అవమానాల పాలు చేస్తోంది. నిజంగానే దొంగగా మారి డబ్బు సంపాదించుకు వస్తే?? చెంప పగిలి పోయేటట్లు కొడుతుంది అతని ఆలోచనల్ని గ్రహించిన లలిత.

ఆ తర్వాత.. - మధుబాబు

Saturday, April 23, 2022

'షాడో వ్యక్తిగత జీవితం' మధుబాబు గారి మాటల్లో.. Part 1 of 4..


'షాడో వ్యక్తిగత జీవితం' మధుబాబు గారి మాటల్లో.. Part 1 of 4..

భోలా శంకర్ సీరియల్ ముందుమాట కన్నా, ఇందులో ఇంకా వివరంగా వుంది! ఇదంతా 'రన్ ఫర్ ది బోర్డర్' లో వుంటుంది.. కానీ ఇంత వివరంగా, వుండదు..

అందరికీ నమస్కారం..

షాడో నవలలు చదవని వారికి సులభంగా తెలియటం కోసం, షాడోని గురించి పరిచయం చేస్తే బాగుంటుందని, ఈ వివరాలు రాయడం జరిగింది. షాడో అసలు పేరు రాజు.

అతను ఒక గ్రాడ్యుయేట్.

ఉద్యోగం కోసం చెప్పులు అరిగిపోయేటట్లు తిరిగి తిరిగి, ప్రయోజనం లేక, ఒక మార్వాడీ ఇంట్లో పని మనిషి వంటి గుమాస్తా ఉద్యోగంలో చేరతాడు. చాలీ చాలని ఆ జీతంతో తృప్తి పడలేదతను. తన దురదృష్టానికి విచారిస్తూ కూర్చోలేదు.

స్వంతంగా ఏదయినా వ్యాపారం చేసుకుందామనే వుద్దేశ్యంతో, రాత్రిళ్ళు రిక్షా లాగి  కొంత డబ్బును కూడబెట్టాడు.

మార్వాడీ కంటపడుతుంది ఆ డబ్బు ఒక రోజున. తను ఇచ్చే జీతంలో రోజూ అంత డబ్బును కూడబెట్టడం అసాధ్యమని అతనికి తెలుసు. అయితే మరి ఎక్కడినుంచి వచ్చింది అతనికి ఆ డబ్బు??

తనదే ఆ సొమ్ము అంటాడు మార్వాడీ.. రాజు తన ఇంట్లో దొంగతనం చేశాడని నింద వేశాడు. పోలీసుల్ని పిలుస్తాడు. తను నిర్దోషినని చెప్పుకుంటాడు రాజు. ఆ డబ్బును తను ఎలా సంపాదించాడో సవివరంగా తెలియజేస్తాడు అందరికీ. ఆ మాటల్ని నమ్మలేదు పోలీసులు. నమ్మలేదు కోర్టు వారు. ఆఖరికి కోర్టుకు హాజరై కేసును విన్న కొద్దిపాటి జనం కూడా నమ్మలేదు.

ఫలితంగా వృద్ధులైన మాతా పితరుల్ని వారి ఖర్మానికి వాళ్లని వదిలేసి, జైలుకు పోయాడు రాజు. జైలులో అతని సత్ప్రవర్తనకు సంతోషించి, శిక్షాకాలం పూర్తి కాక ముందే విడుదల చేస్తుంది ప్రభుత్వం. విపరీతమైన సంతోషంతో విడుదలై వస్తున్న రాజుని చూసి దొంగగా గుర్తించి, హేళన చేస్తారు పరిచయస్తులు.

వారి వెక్కిరింపుల్ని పట్టించుకోకుండా ఇంటికి వచ్చిన రాజుకు తగులుతుంది కరెంట్ షాక్. అతను లేని సమయంలో, దరిద్ర దేవత అతని మాతాపితరుల్ని శల్యావశిష్టుల్ని చేసేసింది.

కొడుకును ఒకసారి కనులారా చూసుకోవటానికే బ్రతికి వుంటాడు అతని తండ్రి. "కలిగిన కుటుంబపు ఆడబడుచు నీ తల్లి. నన్ను ప్రేమించి, ఆస్తినీ, అంతస్తునూ వదిలి వచ్చేసింది. కనీసం కడుపు నిండా తిండి పెట్టలేక పోయాను నా హయాంలో. నీవన్నా నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో.." అని అప్పగింతలు పెట్టి, కొడుకును చూసిన సంతోషంలో కన్ను మూస్తాడు. ఆ దు:ఖాన్ని భరించలేక, అదే క్షణంలో ప్రాణాల్ని కోల్పోతుంది అతని తల్లి. రెక్కలు తెగిన పక్షిలా, తనలో తను కుమిలిపోతున్న రాజును ఓదార్చే వాళ్ళు ఎవరూ వుండరు ఆ చుట్టు పట్ల.

ఎలా వుంటారు? దొంగ కదా అతను.. దొంగ తనం  చేసి జైలు శిక్ష అనుభవించి వచ్చాడు కదా!!

ఇంకా వుందని చెప్పక తప్పటం లేదు.. - మధుబాబు

Friday, April 22, 2022

భోళాశంకర్ నవల | Bholashankar Novel written by Madhu Babu | Audiobook / Podcast Part 2

భోళాశంకర్ నవల | Bholashankar Novel written by Madhu Babu | Audiobook / Podcast Part 2 | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


Facebook Link

Wednesday, April 20, 2022

భోళాశంకర్ / భోలాశంకర్ నవల | Bholashankar Novel written by Madhu Babu | Audiobook / Podcast Part 1

భోళాశంకర్ / భోలాశంకర్ నవల | Bholashankar Novel written by Madhu Babu | Audiobook / Podcast Part 1 | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


Facebook Link

ఈ రోజుటి నుంచి 'భోళాశంకర్' (Audiobook Series) మొదలు.. 11 భాగాలుగా..

 

ఈ రోజుటి నుంచి 'భోళాశంకర్' (Audiobook Series) మొదలు.. 11 భాగాలుగా..

ముందుగా ఒక మాట!

పుట్టుకతోనే దొంగ కాదు షాడో. గ్రాడ్యుయేట్ అయికూడా ఉద్యోగం లభించక, పగలు మదన్ లాల్ అనే మార్వాడీ సేట్ ఇంట్లో పనిచేస్తూ, రాత్రిళ్లు రిక్షా తొక్కేవాడు. కొద్ది కొద్దిగా కూడ బెట్టిన సొమ్ముతో, ఏదైనా వ్యాపారం చేసుకుందామనీ, స్వతంత్రంగా బ్రతుకుదామనీ అతని కోరిక!

మార్వాడీ మదన్ లాల్ కంట పడిందా డబ్బు ఒకనాడు. సేవకుడిగా పనిచేసే మనిషి దగ్గర అంత మొత్తం నిలువ వుండే అవకాశం లేదని పోలీసుల్ని పిలిపిస్తాడు. ఆ డబ్బు తనదేనని అంటాడు.

నిజం చెబుతాడు షోడో.. తను పడుతున్న కష్టాన్ని వివరిస్తాడు. ప్రజలు నమ్మలేదు. పోలీసులు నమ్మలేదు.. కేసును విచారించిన న్యాయ మూర్తులు కూడా నమ్మలేదు అతని మాటల్ని. ఫలితంగా, సంవత్సరం పాటు జైలు శిక్షను అనుభవించవలిసిన గతి అతనికి పడుతుంది.

జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా, అతని వెన్నంటే నిలిచింది దురదృష్టం. ఉద్యోగం కాదుగదా, చిన్న కూలి పని కూడా లభించకుండా పోతుంది.

ఎక్కడ ఏ విధమైన దొంగతనం జరిగినా, వెంటనే వచ్చి తనను స్టేషన్ కి తీసుకుపోయి, లాఠీలతో విరగబాదే పోలీసులతోనూ, తననొక దొంగగానే భావించి అనుమానిస్తున్న సమాజంతోనూ పోరాటాన్ని సాగించలేక, నిజంగానే అడ్డదార్లు తొక్కబోయిన షాడోని ఆదుకుంటారు, అతని స్నేహితులు లలిత, వేణు. తాము పనిచేసే ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తారు.

అందుకు ప్రతిఫలంగా, లలిత మానాన్ని కోరతాడు ఫ్యాక్టరీ యజమాని మన్మోహన్ దాస్.
 
అప్పటికే జీవితం మీద పూర్తిగా విరక్తి చెంది వున్న షాడోని రక్షించుకునేటందుకు, అమానుషమైనా సరే, భర్త అనుమతి తీసుకుని తెగిస్తుంది లలిత.

కోరిక తీర్చుకుని ముఖం చాటుచేస్తాడు మన్మోహన్ దాస్. అడుగ వచ్చిన లలితను గూండాలకు అప్పగించి, తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటాడు.

అవమానాన్ని భరించలేక, తన తెగింపు నిరర్ధకమయిందనే బాధను భరించలేక, ఆత్మహత్య  చేసుకుంటుంది లలిత. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి పోయిన వేణును పోలీసుల చేతే హింసింపచేసి, రైలు కట్ట మీద పారవేయిస్తాడు, మన్మోహన్ దాస్.

న్యాయం మీదా, ధర్మం మీదా, ఆ రెంటినీ పరిరక్షించ వలసిన పోలీసుల మీదా నమ్మకం నశించి, అగ్ని పర్వతం మాదిరి బద్దలైనాడు షాడో.

అతని ధ్యేయం ఒక్కటే!

స్నేహంలోని మాధుర్యాన్ని తనకు చవి చూపించిన అమృతమూర్తులు లలిత, వేణుల మరణానికి ప్రతీకారం చేయాలి!!

తన జీవితాన్ని బాగు చేసేందుకు ఆ పుణ్య మూర్తులు ఎంతటి బాధను అనుభవించారో, అంతకు వెయ్యి రెట్లు అధికంగా, ఆ మన్మోహన్ దాస్ అనుభవించాలి!!

ఎదురు దెబ్బలు తినీ తినీ రాటుదేలిన హృదయంతో, ప్రమాదాల్ని ఎదుర్కొనీ ఎదుర్కొని, బండబారి పోయిన శరీరంతో, మనస్సు విప్పి మాట్లాడుకునే తోడులేక, ఏకాకిగా, అడవులకు అడవుల్ని కాల్చుకు తినే కార్చిచ్చు మాదిరి సంచరిస్తున్న ఆ షాడోకి, అయాచితంగా తారస పడతాడు గంగారాం.

పెట్టీ క్రైమ్స్ తో పొట్ట పోసుకుంటూ, చిన్న సైజు ఆకురౌడీ మాదిరిగా జీవించే గంగారం కలయికతో, విచిత్రమైన మలుపు తిరిగింది షాడో వ్యక్తిత్వం.

నవ్వడం అంటే ఏమిటో, నవ్వు అనేది ఎలా వుంటుందో పూర్తిగా మరచి పోయి, కరకు గుండెల కసాయి వాడిలా సంచరించే అతని పెదవులపై, తొలి సారి ఉదయిస్తుంది అస్పష్టమైన ఓ చిరు దరహాసం..

అగ్ని, వాయువుల సంగమం వంటి వారి కలయికను వర్ణించే కథ ఇది. కలిసిన క్షణం నుంచీ ఒకటైపోయిన వారి సాహస గాథలకు తొలిపలుకు. ..మీ మధుబాబు..

Monday, April 18, 2022

ప్లీజ్ హెల్ప్ మీ!!! మధుబాబు నవల | Please Help Me!!! Novel written by Madhu Babu | Audiobook Part 4

ప్లీజ్ హెల్ప్ మీ!!! మధుబాబు నవల | Please Help Me!!! Novel written by Madhu Babu | Audiobook Part 4 (Concluding) | SMBAB - Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


ప్లీజ్ హెల్ప్ మీ!!! మధుబాబు నవల | Please Help Me!!! Novel written by Madhu Babu | Audiobook Part 4 (Concluding) | SMBAB - Shadow Madhu Babu Audio Books (Official) Exclusive..  Voice by Nrusimhadevara Sudha Dileep..

OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf

►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive

SOCIAL MEDIA:

►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U

►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast

►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu

►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks


AUDIOBOOK / PODCAST DETAILS:

-------------------------------------------------------

Novel: Please! Help Me!!

Genre: Horror

Writer: Madhu Babu

Published In: December, 1996

Published by: MVS Publications

--------------------------------------------------------

లేవాలి! లేచి నిలబడాలి!! నా కోసం ప్రాణాల్ని పోగొట్టుకోబోతున్న ఆ అమాయక జీవిని రక్షించాలి... ఆ తర్వాత నేను ఏమైనా ఫరవాలేదు. లేవాలి... లేచి నిలబడాలి...

పళ్ళు కొరుకుతూ దొర్లి క్రింద పడ్డాను మంచం మీదినుంచి.

మళ్ళీ వినవచ్చింది లక్ష్మి అరుపు.

“మధూ... హెల్ప్ మీ... హెల్ప్ మీ... ప్లీజ్!!!”

నిప్పుల్లో నిలబడినట్లు తుకతుక లాడుతున్నది నా రక్తం. మెదడంతా మొద్దుబారి పోయింది. కళ్ళ ముందున్న ప్రపంచమంతా మాయమైపోయింది. నడుం మీద పలుగులు దింపినట్లు ఎగసుకు వస్తున్న బాధ ఒక్కటే తెలుస్తోంది.

పళ్ళ బిగువున ప్రాకాను గుమ్మం దాకా..

మైకం ముంచుకు వచ్చింది. మూసుకుపోవటం ప్రారంభించాయి కళ్ళు.

“నో... నో...” అని అరుస్తూ తలను నేలకేసి కొట్టాను. కరెంట్ షాక్ కొట్టినట్టు జలదరించింది శరీరమంతా.

ఆవేశం ఒక్కసారిగా ముంచుకు వచ్చింది. ఆవేశంతో పాటు కదిలాయి నా కాళ్ళు. ఒక్కసారిగా... నాకు తెలియకుండానే గుమ్మాన్ని పట్టుకుని లేచి నిలబడ్డాను.

#Pleasehelpme #ShadowMadhuBabu #smbab #Horror #MadhuBabu #TeluguAudioBooks #TeluguPodcasts #TeluguDetectiveNovels #madhubabunovels #shadowtelugunovels #Please Help Me book #Please! Help Me!! by Madhubabu #Telugu Novel by Madhubabu #VoiceofSudha

Please! Help Me!! Novel,షాడో మధుబాబు,smbab,Shadow Madhu Babu Audiobook,Shadow Madhubabu,Madhu Babu Novels Online,Madhu Babu Books,Telugu Novels Audiobooks,ప్లీజ్ హెల్ప్ మీ!!!,Please Help Me!!! Part 4,Telugu Novel Please Help Me!!!,Madhubabu Novel Please Help Me!!!,Please Help Me!!! Audiobook,madhubabu novels,madhubabu books,thriller,telugu horror stories,telugu horror,horror novel,thriller books,horror audiobook,chethabadi,telugu audiobook,telugu podcast,

Friday, April 15, 2022

ప్లీజ్ హెల్ప్ మీ!!! మధుబాబు నవల | Please Help Me!!! Novel written by Madhu Babu | Audiobook Part 3

ప్లీజ్ హెల్ప్ మీ!!! మధుబాబు నవల | Please Help Me!!! Novel written by Madhu Babu | Audiobook Part 3 of 4 | SMBAB - Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


FB Video Link

Thursday, April 14, 2022

ప్లీజ్ హెల్ప్ మీ!!! మధుబాబు నవల | Please Help Me!!! Novel written by Madhu Babu | Audiobook Part 2 of 4

ప్లీజ్ హెల్ప్ మీ!!! మధుబాబు నవల | Please Help Me!!! Novel written by Madhu Babu | Audiobook Part 2 of 4 | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


FB Video Link

Monday, April 11, 2022

ప్లీజ్ హెల్ప్ మీ!!! మధుబాబు నవల | Please Help Me!!! Novel written by Madhu Babu | Audiobook Part 1 of 4

ప్లీజ్ హెల్ప్ మీ!!! మధుబాబు నవల | Please Help Me!!! Novel written by Madhu Babu | Audiobook Part 1 of 4 | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


FB Video Link

Sunday, April 10, 2022

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.. 

1998 లో మహీధర్ (Voice of Maheedhar) తో విజయవాడ స్వర్ణా ప్యాలెస్ లో..



Saturday, April 9, 2022

1996 లో స్వాతి వీక్లీలో వచ్చిన "మిడ్ నైట్ అడ్వంచర్" సీరియల్ లో మధుబాబు గారి మాట!

 


ఒకమాట!

  కాశీమజిలీ వంటి షాడో గాధల్లో, గంగారాంతో అతనికి పరిచయం ఎలా అయిందో తెలియజెప్పే మజిలీ, అతి ముఖ్యమైనది, అత్యంత రమణీయమైనది.

   భోలాశంకర్ పేరుతో స్వాతి పాఠకులకు పరిచయం చేయబడిన ఆ వర్తమానం గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం లేకపోయినా, మొదటినుంచి షాడో కథల్ని క్లోజ్ గా ఫాలో అవుతున్న పాఠకులకు మాత్రమే తెలిసిన కారెక్టర్స్ కొన్ని, ఈ సీరియల్ (మిడ్ నైట్ ఎడ్వంచర్ ) లోకి ఎంటర్ అయినందువల్ల, కొద్దిపాటి వివరణ ఇవ్వటం తప్పనిసరి అయింది.

   చేయని నేరానికి జైలు శిక్షను అనుభవించి, దొంగగా ముద్ర వేయించుకున్నాడు షాడో. తోడ బుట్టిన వాడికంటే ఎక్కువగా తనను అభిమానించిన లలితనూ, స్నేహితుడు వేణునూ పోగొట్టుకుని, అందుకు కారకులైన వారి మీది కచ్చతో, నిజంగానే దొంగ అయినాడు.

   దొంగతనాల గురించీ, దొమ్మీల గురించీ షాడోకి తెలియ చెప్పిన వాడు, కణ్ణస్వామి అనే ఒక మాజీ దొంగ.

   బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో, పందెంకట్టి గవర్నర్ జనరల్ నివసించే భవంతినే కొల్లగొట్ట సాహాసించిన గడుసు పిండం, ఆ కణ్ణస్వామి.

   అడవులకు అడవుల్నే ఆహారంగా తీసుకునే కార్చిచ్చుకు, ఈదురుగాలి తోడు ఎలా అవుతుందో, దొంగగా మారిన షాడోకి గంగారాం అలా స్నేహితుడు అయినాడు. గంగారాంతో పాటు, రాజస్థాన్ స్మగ్లర్స్ కొంతమంది కూడా షాడోకి ఆప్తులుగా మారారు.

   పంచ పాండవుల మాదిరి అయిదుగురు సోదరులు, ఆ స్మగ్లర్స్. పెద్దవాడు రామ్ దయాళ్.. తరువాత రంగరాజు, ధనుష్కోటి, దీనబంధు, తుకారాం మొదలైనవి వారి పేర్లు.

   సరిహద్ధు రాష్ట్రమైన రాజస్థాన్ లో నివశిస్తూ వుండటం వల్ల, పాకిస్థాన్ లో వుండే రకరకాల మనుషులతో పెద్ద పెద్ద పరిచయాలు వున్నాయి ఆ సోదరులకు.

   ప్రస్తుతం స్వాతి పాఠకులు చదువుతున్న ఈ మిడ్ నైట్ అడ్వంచర్ లోని ఎముకల వైద్యుడు డాక్టర్ అబ్బాస్ అలీ, అటువంటి వారిలో ఒకడు.

   అందుకే, రామ్ దయాళ్ సోదరుల ద్వారా అతి తేలికగా షాడోని కాంటాక్ట్ చేయగలిగాడు అతను.

   దొంగగా సంచరించే రోజుల్లో, రాజస్థాన్ లోని గిరాబ్ గ్రామంలో నందన్ లాల్ అనే కోటీశ్వరుడిని దోచుకునే ప్రయత్నం చేశాడు షాడో.

   కడుపున పుట్టిన బిడ్డను పాకిస్థాన్ లోని మహమ్మద్ అనే బందిపోటు కిడ్నాప్ చేసి తీసుకుపోతే, బిడ్డకంటే డబ్బే ముఖ్యమని ఎంచి, కామ్ గా కూర్చో గలిగిన కర్కోటకుడు, ఆ నందన్ లాల్.

   కడుపు తీపి తన గుండెల్ని పిండి చేస్తున్నా, భర్త మనసును మార్చే శక్తి లేకపోవడం వల్ల, ఆ బాధను మనసులోనే దాచుకుని తపించిపోతున్న ఆ నందన్ లాల్ భార్య ముఖం చూసి, వారి వంశాంకురం కోసం పాకిస్థాన్ లోకి పోయాడు షాడో.

   అసలు పనుల్ని వదిలేసి, కొసరు పనుల కోసం ప్రాణాల మీదికి తెచ్చుకోవటం, షాడోకి బాగా అలవాటు. చంఘీజ్ ఖాన్ అనే ఒక దేశద్రోహి అష్రాప్, సిటీకి దగ్గిర్లోని షాకర్ డామ్ ని ధ్వంసం చేసి, ప్రజలందరూ చెల్లా చెదురు అవుతున్న సమయంలో, ఆ సిటీని దోచుకోవటానికి పథకం వేశాడు.

   బందిపోటు మహమ్మద్ సహాయంతో ఆ పథకాన్ని అడ్డుకుంటాడు, షాడో. ఆ బందిపోటుకు ఆప్తుడు అవుతాడు.

   ప్రాణాలు పోయేటంతవరకూ స్నేహితులుగానే వుంటామని అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేసుకున్నారు వారిద్దరూ.. తామే కాదు - తమకు పుట్టబోయే సంతానం కూడా అలాగే వుండి తీరాలని కూడా అనుకున్నారు. అందుకు సాక్ష్యంగా, తమ గుండెల మీద పచ్చబొట్లు పొడిపించుకున్నారు.

   ఆర్తులకూ, అనాధలకూ సేవ చేయటం ఒక్కటే, భగవంతుడిని చేరుకునేందుకు మార్గమని భావించే ముస్లిం ఫకీర్ ఒకతను, బందిపోటు మహమ్మద్ కి బాగా పరిచయం.

   ఫకీర్ బాబాగా అందరూ పలకరించే ఆ పవిత్ర హృదయుడికి, షాడో ఎటువంటి వాడో బాగా తెలుసు. అతను పాకిస్థాన్ లోకి అడుగు పెడితే ఏం జరుగుతుందో, ఇంకా బాగా తెలుసు!

   ఈ పాత్రల ప్రవేశంతో ప్రారంభమయ్యే ఈ ఎడ్వెంచర్ మీకందరికీ నచ్చుతుందని ఆసిస్తూ.. - మధుబాబు

1996 లో స్వాతి వీక్లీలో వచ్చిన "మిడ్ నైట్ అడ్వంచర్" సీరియల్ లో మధుబాబు గారి మాట!

Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

  • దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita - *దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, ...
    1 year ago
  • ఉద్ధవ గీతలో ఏం ఉంది? Uddhava Gita - *‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! జూదంలో ఓడిపోకుండా పాండవులను శ్రీ కృష్ణుడు ఎందుకు కాపాడలేదు?* ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలూ, వేష ధారణ కూడా క...
    1 year ago
  • అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavadgita - *అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 ...
    1 year ago

COUNTER


View My Stats