జ్ఞాపకాలు!
నేను వ్రాసిన షాడో నవలలు పాఠకులను ఆకర్షించి, ఆ పుస్తకాలకు డిమాండ్ పెరగటంతో, ఆ నవలల్ని తమ పబ్లికేషన్స్ కు కూడా వ్రాయమని అడిగారు, చాలామంది పబ్లిషర్స్.. చాలా కాలం నాటి మాట ఇది..
నా టాలంట్ ని గుర్తించి, నన్ను అమితంగా ప్రోత్సహించిన యం.వీ.యస్. వారికి పోటీగా, వెరే వారి దగ్గిర్నించి నా నవలలు రావటం ఇష్టం లేక, అప్పుడు వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ తిరస్కరించాను.
తమ మాటల్ని కాదన్నానన్న కచ్చతో, నాకు డూప్లికేట్స్ ని సృష్టించారు ఆ పబ్లిషర్స్.
'షాడో'కున్న డిమాండ్ ని తాము కూడా ఎంజాయ్ చేయటానికి, రక రకాల ప్రయత్నాలు చేశారు.
షాడో నాకు పేరు తెచ్చి పెట్టాడు గానీ ఆర్ధికంగా సహాయ పడలేదు ఆ రోజుల్లో..
నేను ఏమీ చేయలేని పరిస్తితి. కానీ, షాడో అభిమానులు మాత్రం చాలా సీరియస్ అయిపోయారు. ఆ పబ్లిషర్స్ దగ్గిరికి స్వయంగా పోయి, తమ నిరసనను వ్యక్తం చేశారని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది.
ఏం చెప్పారో ఎలా చెప్పారోగానీ, మటుమాయం అయిపోయారు 'డూప్లికేట్ మధుబాబు'లు.
ఈ మధ్య డూప్లికేట్స్ రాలేదుగానీ, యూట్యూబులో నా పుస్తకాలను ఆడియో బుక్స్ రూపంలో పబ్లిష్ చేయటం మొదలు పెట్టారు చాలా మంది. ఓపిక పట్టాను. వద్దని కామెంట్లు కూడా వారి చానెల్స్ లో పెట్టాను. ఎవరూ వినిపించుకోలేదు. వినిపించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నట్టు తమ దండ యాత్రని కొనసాగిస్తున్నారు.
మరోసారి షాడో అభిమానులకు చురుక్కుమన్నది. టెక్నాలజీ మీద పట్టున్న వాళ్ళు అందరూ నడుంబిగించారు. ఒకటొకటిగా మాయం అయిపోతున్నాయి ఆచానెల్స్. ఇక ముందు కూడా అవుతాయి.
అనుమతి లేకుండా షాడోని వాడుకున్నా.. మధుబాబు పేరును వుపయోగించినా, వదిలి పెట్టటం జరగదని చెపుతున్నారు.
అయితే ఆడియో బుక్స్ ని పబ్లిష్ చేసేందుకు, నేను మూడు సంస్థలకు అనుమతిని ఇచ్చాను.
'గానా డాట్ కాం' వారికి రెండు.. 'బుక్ వేద' వారికి అయిదు... 'స్టొరీ టెల్' వారికి ఇరవై నవలలు ఆడియో బుక్స్ గా వేయడానికి Permission ఇచ్చ్చాను..
ఈ మూడు చానెల్స్ లో నేను అనుమతి ఇచ్చిన నవలలూ, మిగిలినవి నా అఫిషియల్ చానెల్ లోనూ తప్ప, ఇంక ఏ చానెల్ లోనూ, నా రచనలైన షాడో నవలలు గానీ, జానపదాలు గానీ, సొషియో క్రైం నవలలు గానీ రావు..
నన్ను అభిమానించి, ఎంతగానో సహాయ పడుతున్న అభిమానులకు ఈ వివరాలను అందచేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.
అనుమతి లేకుండా నా రచనల్ని వుపయోగించుకుంటున్న వారి వివరాల్ని నాకు పంపిస్తున్న షాడో లవర్స్ కి నా హృదయపూర్వక నమస్సులు.. - మధుబాబు
0 comments:
Post a Comment
Here You Can Communicate with me: