SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Monday, March 9, 2026

గోల్డెన్ షాడో - Golden Shadow: Shadow Past Life Thriller (Latest Shadow Book)

 

Madhu Babu Latest Shadow Book 2025

గోల్డెన్ షాడో - Golden Shadow: Shadow Past Life Thriller



--------------------------------------------------------

షాడో పాస్ట్ లైఫ్ సిరీస్ లిస్ట్ :-

భోలాశంకర్ 

రన్ ఫర్ ది బోర్డర్ 

షాడో!షాడో!!షాడో!!!

టైగర్ మున్నా

రన్ ఫర్ ది హైలాండ్స్ 

షాడో ఇన్ జపాన్ 

బంజాయ్ 

బాబా

స్టార్ ఫైటర్ - కథ ప్రకారం ఇవి వరుసక్రమం. వీటికి కొనసాగింపుగా 'దుర్మార్గుడు' నవల కూడా కలుపుకోవచ్చు.

వారియర్ షాడో, నల్లతాచు, గోల్డెన్ షాడో - రీసెంట్ గా మొదలైన మరొక సిరీస్..

ఇవి కాకుండా ఇంకా :-

2 మైల్స్ టు ది బోర్డర్ 

దొంగ. దొంగ.. దొంగ... పట్టుకోండి. పట్టుకోండి..

వన్స్ ఎగైన్ షాడో

షాడో! షాడో!!

రెడ్ షాడో

యముడు - 'స్పై'గా మొదలయినా, కథంతా షాడో పాస్ట్ లైఫ్ (ప్లాష్ బ్యాక్ )

--------------------------------------------------------

Shadow Adventures




--------------------------------------------------------
Now all books of Madhu Babu, right from his first book in 1973, all are available digitally at Google Play Books, World Wide..

Vintage Pocket Books




#MadhuBabu #Latest #Shadow #PastLife #ShadowNovels #ShadowNovelsNew #MadhuBabuLatest #MadhuBabuLatestBooks #MadhuBabuLatestNovels #MadhuBabuNewNovels #MadhuBabuBooks #MadhuBabuNewBooks #DigitalBooks #EBooks #OnlineBooks

Friday, February 20, 2026

పాము - The Snake


పాము - The Snake: Socio Crime Thriller @Google Play Books


“రక్తం.... రక్తం.... రక్తం ధారలు కనిపిస్తోంది నాకు. నా పుట్ట వున్న గుట్ట మొదట్లో రక్తం కాలువలు కడుతున్నట్లు అనిపిస్తోంది. రండి రోయ్ రండి... అందరూ రండి... త్వరగా రండి. ఆ లలితమ్మ ఎక్కడ వున్నదో చూసి వెంటనే నా దగ్గిరికి తీసుకురండి” ఉన్నట్లుండి లేచి నిలబడుతూ గొంతు చినిగిపోయే శృతిలో కేకలుపెట్టడం మొదలుపెట్టింది గణాచారి.

ఊరి మధ్యలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఎదుట పెద్ద పందిరి వేసి, హరికథలు చెప్పిస్తున్నారు గ్రామ పెద్దలు. రాత్రి ఎనిమిదింటికి మొదలు అయింది ఆ రోజు కథ... సుభద్రా పరిణయంలో అర్జునుడు సుభద్రను తీసుకుని ద్వారకా నగరంలో నుంచి పారిపోయి వచ్చే ఘట్టాన్ని రమ్యంగా చెపుతున్నాడు హరికథలు చెప్పటాన్ని నేర్చుకొచ్చిన ఆలయ పూజారి మనవడు.

“దీనిదుంపతెగ... కురుక్షేత్ర యుద్ధం కథ చెప్పేటప్పుడు నెత్తురు కనిపిస్తోందని కేకలు పెట్టటంలో అర్థం వుంటుంది. సుభద్రా కల్యాణంలో నెత్తురు నెత్తురంటూ లేచి నిలబడింది. దీనికి పట్టింది పూనకం కాదు. పిచ్చి... ఇది పూనకాల పిచ్చే. సందేహంలేదు” సన్నటి కంఠంతో తన పక్కన వున్న పెద్దాయనతో అన్నాడు ఒక పౌరుడు.

“ఎవడ్రా? ఎవడ్రా నన్ను వెక్కిరిస్తోంది? ఎవడ్రా అది?” కళ్ళను పెద్దవిచేసి కోరగా చూస్తూ చెవులు చిల్లులుపడే స్థాయిలో అతి బిగ్గరగా అరిచింది గణాచారి.

చటుక్కున నోటిని మూసుకుని తలక్రిందికి వంచేసుకున్నాడు ఆ పౌరుడు. పక్కనవున్న పెద్దాయన వెక్కిరింపుగా నవ్వినా ఏమాత్రం పట్టించుకోలేదు.

“లలితమ్మ... లలితమ్మను పిలవండిరా అంటే మూగ మొద్దుల మాదిరి అలా నిలబడి పోతారేమిటిరా? పిలవండిరా... వెంటనే నా దగ్గిరికి రమ్మని చెప్పండి” జుట్టు విరబోసుకుని తాచు పాము ఊగినట్లుగా ముందుకీ వెనక్కీ ఊగుతూ రెట్టించి అరిచింది గణాచారి.

మధుబాబు గారి పుస్తకాల సిరీస్ లింక్స్:

షాడో పెద్ద పుస్తకాలు: https://play.google.com/store/books/series?id=V5N7HAAAABAtjM
సోషియో క్రైమ్ థ్రిల్లర్స్: https://play.google.com/store/books/series?id=xgqYHAAAABBfFM
వాత్సవ శ్యాంసుందర్: https://play.google.com/store/books/series?id=opN7HAAAABDYjM

#pdf #download #online #digitalbook #ebook #googlebooks #googleplaybooks













Sunday, January 25, 2026

Detective Crime Fantasy Adventure 'నిశ్శబ్దనాదం'

 

త్వరలో..

మధుబాబు గారి, 'శ్యామ్ సుందర్ - వాత్సవ' Detective Crime Fantasy Adventure 'నిశ్శబ్దనాదం' - 31-01-2026 నుంచి ప్రారంభం..

మనిషి ఎదురుగా కనిపించకుండా మాటలు వినబడటం డెఫినిట్గా మెదడుకు ఏదో వ్యాధి సోకిందని చెప్పే సూచనే.
చూస్తూ కూర్చుంటే అది మరింత అధికమై, తనెవరో ఏం చేస్తున్నాడో ఎటు పోతున్నాడో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు.
వెంటనే కదలాలి తను. అక్కడినించి బయటపడి అర్జంటుగా తనకు తగిలిన గాయాలకు సరైన చికిత్సను చేయించుకోవాలి.
బండరాయిని గట్టిగా పట్టుకుని శిలావిగ్రహంలా నిలబడి వున్న శ్యామ్ సుందర్ పరిస్థితి తనకు తెలిసిపోయినట్లు మరింత గంభీరంగా వినవచ్చింది ఆ కంఠం.
“ఇప్పుడు నువ్వు సరైన ఆలోచన చేస్తున్నావు. ఇందాకటి నించీ నీకు నేను చెపుతున్న మాటల్నే తిరిగి నువ్వు మననం చేసుకుంటున్నావు. ముందు ఆ బండను వదిలి నడక మొదలుపెట్టు... నడువ్... త్వరగా...”
ఆ కంఠం ఎవరిదో, ఎక్కడినించి వినవస్తోందో తెలుసుకోవాలన్న కోరికను పూర్తిగా వదిలేశాడు శ్యామసుందర్. బండను వదిలి రెండు అడుగులు ముందుకు వేశాడు.
మూడో అడుగు వేయబోతుండగా, చిన్నగా కదిలింది ఇసుకలో నిస్త్రాణంగా పడి వున్న మేకపిల్ల. లేచి నిలబడేందుకు అవసరమైన ఓపిక నశించిపోవటం వల్ల, తలను మాత్రం కొంచెంగా పైకెత్తి చిన్నగా అరిచింది.

అసలేం జరిగింది? మనస్సులో మాటల్ని కూడా గ్రహించి మాట్లాడుతున్న ఆ కంఠం ఎవరిది!

Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

COUNTER


View My Stats