SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Tuesday, August 2, 2022

కాళికాలయం Kalikalayam Auiobook Release

 

జై కాళీ..
జై జై మహాకాళీ..
దశదిశలు దద్దరిల్లే
ఝంఝా మారుతం లాంటి కంఠం
అక్కడ ఉచ్ఛైస్వరంతో మారుమ్రోగింది..

పిశాచాల దండు పండగ చేసుకునే
ఆ నిశిరాత్రి సమయంలో గుడ్లగూబ, తీతువుపిట్ట వెంటరాగా..
వెర్రిగా అరుస్తూ ఆ ప్రదేశానికి వచ్చి వాలిందో అప్సరాంగన..
అమావాస్య చీకటిని తన పూర్ణ వదనంతో,
పున్నమివెన్నెల్లా చేసిందా అందాలరాశి..

ఒడలంతా సర్రున రక్తాన్ని ప్రవహింపజేసి,
ఉద్వేగానికి లోనుచేసే ఊహతీత సీరియల్..

మధుర మనోహర సంభాషణలతో..

ఎక్కుపెట్టిన మదనుని శరంలా వుందామె..
పైన కప్పుకుని వున్న ఆ దివ్య సుందర రత్నాంబరాన్ని అలవోకగా నేలకు జార్చి,
మొలనూలు మువ్వలతో సవ్వడి చేస్తూ,
రాయంచలా కదిలి వచ్చిందా సుందరి..

తపోధనుడైవున్న ఆ యువకుడు కనులు తెరవగానే
శీతాంశు కిరణ ప్రభ ఆమె నావరించుకుంది..

ఒత్తైన తన యవ్వనాన్ని మత్తుగా విరుచుకుంటూ మరులు కొలుపుతూ రాసాగింది మునుముందుకు..

జానపద సీరియల్స్ కే రాచముద్ర వంటి సీరియల్..

మధుబాబు 'కాళికాలయం' 05-08-2022 నుండి ప్రారంభం..

0 comments:

Post a Comment

Here You Can Communicate with me:

Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

COUNTER


View My Stats