SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Sunday, May 18, 2025

'21/05/2025' సాయంత్రం 6 గంటలకు ప్రారంభం 'వెన్నెల మడుగు' (Vennela Madugu).. మహీధర్

 


'21/05/2025' సాయంత్రం 6 గంటలకు ప్రారంభం 'వెన్నెల మడుగు' (Vennela Madugu).. మహీధర్ @ShadowMadhuBabupodcast

AUDIOBOOK DETAILS:
-------------------------------------------------------
Novel: 'వెన్నెల మడుగు' (Vennela Madugu)
Genre: Fantasy / Folklore
Author / Writer: Madhu Babu
Published In: Serialised in 'Bala Tejam Children Magazine' 1996, Novel Published in 1997
Published by: Satya Vani Publications
Number Of Pages: 144
Language: Telugu
--------------------------------------------------------

మధుబాబు గారి జానపద నవల : వెన్నెల మడుగు

ప్రవాళ దేశానికి రాజు కీర్తిసేనుడు. మహావీరుడైన కీర్తిసేనుడిని లొంగదీసుకోవడం ఎవరి తరం కాలేదు. అటువంటివారిలో పాంచాలరాజు వీరవర్మ మొదటివాడు. వీరవర్మ శఠగోపుడు అనే కపాలికుడిని ప్రవాళరాజ్యం లోకి ప్రవేశపెట్టి, అతని ద్వారా కీర్తిసేనుడిని చంపించాలని అనుకుంటాడు. 

శఠగోపుడు తనను ఆదరించిన కీర్తిసేనుడితో నీకు సంతానం కావాలంటే మహారణ్యం లో ఉన్న అపరాజిత దేవి ఆలయానికి వెళ్లి ఆ దేవిని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పటంతో కీర్తిసేనుడు ప్రయాణం అవుతాడు. శఠగోపుడి ఉద్దేశ్యం ఆ అడవిలో ప్రవేశించిన వారు వెనక్కు రావడం అసాధ్యం, అక్కడున్న యక్షిణీ భూతాల వల్ల మరణిస్తారు అని. అయితే రాజు తిరిగి వస్తూ యక్షిణి శాపానికి గురి అవుతాడు.

అపరాజిత దేవి దగ్గర వరం పొంది తిరిగి వస్తున్న కీర్తిసేనుడు యక్షిణి శాపానికి గురి అవుతాడు. ఆ శాపం వల్ల కన్న బిడ్డకి దూరం అవుతాడు. యక్షిణి బారినుంచి కీర్తిసేనుడి కొడుకు ప్రకృతి వైపరీత్యం వల్ల యక్షిణి దృష్టికి అందకుండా విరథుడు అనే మాంత్రికుడిచే కాపాడబడుతాడు. ఒంటరిగా ఆశ్రమంలో ఉండే ఆ మాంత్రికుడు కీర్తిసేనుడి కొడుకును చూసుకొనుటకు ఒక స్త్రీ మూర్తిని సృష్టించి, ఆమెకి మాళవిక అని నామకరణం చేస్తాడు. ఆమె ఆ బాలుడిని ప్రేమగా పెంచుతుంటుంది.  విరథుడికి శంబూకుడు అనే శత్రువు వుంటాడు. శంబూకుడు విరధుడిని మయోపాయంతో బంధించి పాతాళం వంటి బిల్వంలోకి పంపించేస్తాడు. మాళవిక కీర్తిసేనుడి కొడుకును దూరంగా వేరొక గ్రామానికి తీసుకుని వెళ్లి, పెంచి పెద్ద చేస్తుంది. వారెవరో ఎవరికీ తెలియకుండా అక్కడి గ్రామస్తులతో కలిసిపోయి, వారితో సమానంగా కష్టపడుతూ, ఆ బాలుని పెంచి పెద్దజేస్తుంది. 12 ఏళ్లకే ధైర్య సాహసాలు కలిగిన వాడై, అనుకోకుండా నీలమణిని పొందుతాడు. దాని ద్వారా మొక్కలు, పొదలు, వృక్షాలతో మాట్లాడగలుగుతాడు. వాటి వల్లే తన జన్మ రహస్యం తెలుసుకోగలుగుతాడు. మాళవిక అతనికి విజయుడు అని నామకరణం చేస్తుంది.

అతనుండే వూరు సిరిపురం రాజ్యానికి చెందినట్లు, వారి రాజు ధవళ కాంతుడని, అతని కుమార్తె రాగరంజనిని ఆటవిక నాయకుడు కాలవర్మ దుర్మార్గంతో  అపహరించి, వివాహ ప్రయత్నం చేస్తుంటాడని, ఆమెని కాపాడటం అతని కర్తవ్యం అని మొక్కల ద్వారా తెలుసుకుంటాడు విజయుడు. ఎన్నో ఆటంకాలు, ఆవరోధాలను దాటుకుంటూ  విజయుడు ఆ రాజకుమారిని కాపాడి, ఆమె రాజ్యానికి పంపుతాడు. ఆ ప్రయాణంలో ఆ రాజకుమారి ప్రవర్తనతో విసుగు చెందుతాడు. పాఠకులకు కూడా ఆమె ప్రవర్తన భరించలేనిదిగా ఆ పాత్రను సృష్టించిన రచయిత, విజయుడు తన రాజ్యం చేరుకుని పరిపాలన చేస్తాడు అంటూ ఆ రాజకుమారినే పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో... కీర్తిసేనుడి గురించీ, అతని రాజ్యపాలన గురించీ ప్రస్తావన లేకుండా అంత పొగరుబోతు రాకుమారినే వివాహం ఎందుకు చేసుకున్నాడో తెలియక,  ముగింపులో రచయిత హడావుడి పడినట్లు పాఠకులు కొంత అసౌకర్యానికి గురి అవుతారు. కానీ, ఇది ఓవరాల్ గా మధుబాబు గారి మరో చక్కటి జానపద రచన.

#వెన్నెలమడుగు #షాడోమధుబాబు #VennelaMadugu #shadowmadhubabu #madhubabu #teluguaudiobooksyoutube #teluguaudiobook #telugupodcast #fantasynovels #VoiceofSudha #telugukathalu #telugunovels #audiobooks #Fantasystories #folklorestories #freebook #ebookreader #novelreader #podcast #audiobook #telugu #novel #story #serial #kathalu

Sunday, March 16, 2025

'19/03/2025' సాయంత్రం 6 గంటలకు ప్రారంభం 'శిక్ష' (Siksha)..


'19/03/2025' సాయంత్రం 6 గంటలకు ప్రారంభం 'శిక్ష' (Siksha)..  @ShadowMadhuBabupodcast

మంత్ర ప్రయోగం - మరకత మంజూష జానపద నవల Episode 51 | Marakatha Manjusha Folklore / Fantasy Novel written by Madhu Babu..

https://youtu.be/8GPr7LN7Sm8


teluguvoice.in audi9.com #teluguaudiobooks

Tuesday, February 18, 2025

భయం.. భయం - Bhayam.. Bhayam


ఈ 20/02/2025 న మార్కెట్ లోకి వచ్చే 'స్వాతి సపరివార పత్రిక'లో..  @ShadowMB  
మధుబాబు గారి ఉత్కంఠ భరితమైన సరికొత్త సీరియల్ ప్రారంభం..
'భయం.. భయం' (Bhayam.. Bhayam) - సీక్రెట్ ఏజెంట్ 'షాడో' (Shadow) వినూత్న సాహస యాత్ర..

మన చానెల్ లో రావడానికి టైమ్ పడుతుంది. కాబట్టి ఈ లోపు కొని చదివేద్దామా?.. మహీధర్

Thursday, January 16, 2025

మరకత మంజూష జానపద నవల | Marakatha Manjusha Folklore / Fantasy Telugu Novel (2 Volumes) written by Madhu Babu


 

ఈ రోజు సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం 🙏 ‪‪‪

మధుబాబు గారి అద్భుత జానపద నవలా ద్వయం 'మరకత మంజూష'.. మహీధర్

https://www.youtube.com/playlist?list=PLH8sKIJ0wgDdaSh4AuKSXJJaaraOcBPar

AUDIOBOOK DETAILS:

-------------------------------------------------------

Novel: 'మరకత మంజూష' (Marakatha Manjusha) 2 Volumes

Genre: Fantasy / Folklore

Author / Writer: Madhu Babu

Published In: Serialised in NADI Monthly (2013), Novel Published (2014)

Published by: Madhu Priya Publications

Number Of Pages: 476

Language: Telugu

--------------------------------------------------------

'మరకత మంజూష' ప్రముఖ రచయిత మధుబాబు సృష్టించిన తెలుగు జానపద అపరాధ పరిశోధక రచన.

'అంబా..' అని అరిచింది ఆ లేగ దూడ. పాతిక అంగల దూరంలో ఉన్న బండరాళ్ల మధ్యన ఎత్తుగా పెరిగి ఉన్న గడ్డిని మేస్తోంది దాని తల్లి. బండ రాళ్ళ మీద నుంచి ఎగిరి  ఇవతలికి దూకిందది. నాలుగే నాలుగు అంగలలో అతి వేగంగా వచ్చేసింది బిడ్డ దగ్గరికి. దారుణంగా వీస్తున్న చలి గాలిని తట్టుకోలేక ఆర్తనాదం చెయ్యలేదు ఆ చిన్ని ప్రాణం. ఆకలిని భరించలేక కూడా అరవలేదది. ఎత్తుగా ఉన్న బండ రాళ్ళ మధ్యలో నుంచి మెల్లి మెల్లిగా ముందుకు జరుగుతున్నది ఒక పెద్ద తోడేలు. దాని చూపంతా నడవటం కూడా సరిగ్గా చేతకాని ఆ చిన్ని ప్రాణి మీదనే కేంద్రీకరించబడి వున్నది. తలను ముందుకు వంచి కొమ్ముల్ని బారుచేసి పెద్దగా బుసకొట్టింది తల్లి. గిట్టలతో మట్టిని రువ్వుతూ తన బిడ్డను రక్షించుకోవటానికి సిద్ధపడింది. తరువాత ఏం జరిగిందో ఈ ఆడియో బుక్ విని తెలుసుకోండి..

#క్షుద్రప్రాణి #మరకతమంజూష #షాడోమధుబాబు #MarakathaManjusha #shadowmadhubabu #madhubabu #teluguaudiobooksyoutube #teluguaudiobook #telugupodcast #fantasynovels #VoiceofSudha #telugukathalu #telugunovels #audiobooks #Fantasystories #folklorestories #freebook #ebookreader #novelreader #podcast #audiobook #telugu #novel #story #serial #kathalu

క్షుద్ర ప్రాణి, మరకత మంజూష, Marakatha Manjusha, Marakatha Manjusha Episode 1, Marakatha Manjusha madhubabu Novel, smbab, Fantasy stories, folklore stories, telugu stories, voice of sudha, madhu babu official, podcast telugu, Listen to novels, madhu babu novels, madhubabu janapada novels, madhubabu fantasy novels, telugu novels, shadow madhu babu audiobooks, telugu audiobooks, Marakatha Manjusha novel, Marakatha Manjusha book, Marakatha Manjusha audiobook, Audio Series, smb

Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

  • దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita - *దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, ...
    2 years ago
  • ఉద్ధవ గీతలో ఏం ఉంది? Uddhava Gita - *‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! జూదంలో ఓడిపోకుండా పాండవులను శ్రీ కృష్ణుడు ఎందుకు కాపాడలేదు?* ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలూ, వేష ధారణ కూడా క...
    2 years ago
  • అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavadgita - *అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 ...
    2 years ago

COUNTER


View My Stats