SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Showing posts with label Madhu Babu. Show all posts
Showing posts with label Madhu Babu. Show all posts

Saturday, March 21, 2026

మధుబాబు గారికి, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సమర్పించిన సన్మాన జ్ఞాపిక 💐 శుభాకాంక్షలు.. మహీధర్


మధుబాబు గారికి, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సమర్పించిన సన్మాన జ్ఞాపిక 💐 శుభాకాంక్షలు.. మహీధర్

Shadow Madhubabu: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య వేదిక, తన 224వ సాహిత్య సదస్సును నిర్వహించేందుకు సిద్ధమైంది. తెలుగు క్రైమ్ నవలల్లో ‘షాడో’ పాత్రతో తిరుగులేని గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత ‘షాడో’ మధుబాబు గారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

సదస్సు విశేషాలు:

అంశం: ‘నేను నా షాడో’ (తన రచనా ప్రస్థానంపై మధుబాబు ప్రసంగం)
తేదీ: మార్చి 22, 2026 (ఆదివారం).
సమయం: మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు (CST).
వేదిక: 2681 MacArthur Blvd, Suite #204, Lewisville, TX 75067.నిర్వాహక బృందం (Executive Committee):
అధ్యక్షురాలు: మాధవి లోకిరెడ్డి (734) 709-9968
సమన్వయకర్త (సాహిత్య వేదిక): దయాకర్ మాడ (860) 326-9847
ప్రెసిడెంట్-ఎలెక్ట్: ఉదయ్ కిరణ్ నిడిగంటి
వైస్ ప్రెసిడెంట్: సునీల్ సురాపరాజు
సెక్రటరీ: చంద్ర శేఖర్ రెడ్డి పొట్టిపాటి
జాయింట్ సెక్రటరీ: కమలాకర్ దేవరకొండ
ట్రెజరర్: పవన్ వర్మ
జాయింట్ ట్రెజరర్: లెనిన్ బాబు వేముల
బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్: నిడిగంటి గోవర్ధనరావు, నవీన్ గొడవర్తి, ఎస్.కె.ఎస్. రాజు.
వర్చువల్ వేదిక:
నేరుగా హాజరు కాలేని వారి కోసం జూమ్ (Zoom) సౌకర్యం కల్పించారు.

Tuesday, December 2, 2025

స్వాతి సపరివారపత్రిక - 'వసంతోత్సవం' లో ఓ సన్నివేశం.. మధుబాబు A scene from Madhu Babu's 'Vasantotsavam' in Swathi Weekly


స్వాతి సపరివారపత్రిక - 'వసంతోత్సవం' లో ఓ సన్నివేశం.. మధుబాబు

రేవంతుడు తిరిగి వచ్చేంత వరకు ఏదో ఒక కాలక్షేపం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు భార్గవుడు. కోపం వస్తే ఆ కోడె దూడ ఏం చేస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు కాబట్టి తడబాటు లేకుండా కదిలాడు.

"నీకు చేతనైతే నన్ను క్రిందికి నెట్టు... నీ పాదాలతో నన్ను తీవ్రంగా గాయపరచవచ్చు" అంటూ ఒక అడుగు అవతలికి జరిగాడు. అతన్ని పొడిచి వెల్లకిలా పడవేయాలని అనుకున్న ఆ దూడకి అసాధ్యం అయిపోయింది అతడిని పొడవడం... మరింత పెద్దగా బుస కొడుతూ గిరుక్కున అతని కేసి తిరిగింది. ఇంకో అడుగు అవతలికి వేసి అరచేత్తో దాని వెన్నుమీద అలవోకగా తట్టాడు భార్గవుడు. అవమానం అధికం అయిపోయింది దూడకి. ఆగ్రహం రెండింతలు పెరిగిపోయింది. గిట్టలతో నేలను దువ్వుతూ ఇంకోసారి అతని మీదకి దుమికింది. నవ్వుతూ మళ్లీ తప్పించుకున్నాడు భార్గవుడు. వెంట్రుకవాసి దూరంలో నుంచి పోయి ముందుకు తూలింది దూడ.

జొన్నల్ని శుభ్రంగా దంచి చిక్కటి జావను తయారు చేసింది రేవంతుడి భార్య... నంజుకునేందుకు రుచికరమైన ఊరగాయ ముక్కల్ని పెట్టి ఇంటి వెలుపలికి వచ్చింది భార్గవుడికి ఇవ్వటానికి. ఇంటి ఎదుట కనిపించిన దృశ్యం ఆమెను ఆశ్చర్య చకితురాలిని చేసేసింది. 

క్షణక్షణానికి అధికం అయిపోతున్న కోపంతో రాక్షసి మాదిరి రోజుతోంది దూడ. భార్గవుడి అంతు చూసి తీరాలన్న పట్టుదలతో గంతులు వేస్తోంది. దూరంగా పారిపోవటం లేదు భార్గవుడు. ఆ దూడకు బెత్తెడు దూరంలోనే కదులుతున్నాడు. దాని తలకు గాని పాదాలకు గాని అందటం లేదు.

కర్ర సాము చేస్తున్నప్పుడు నృత్యం చేస్తున్నట్టు కనిపించిన అతని పాదాలు ఇప్పుడు కూడా అదే మాదిరి లయబద్ధంగా కదులుతున్నాయి. పావు ఘడియ, అర్థ ఘడియ గడిచిపోయిన తర్వాత కూడా భార్గవుడిని పడగొట్టలేకపోయింది కోడెదూడ...

కనీసం అతన్ని తాకను కూడా తాకలేకపోయింది అది. ఎంత వేగంగా కదులుతుందో అంతకు రెట్టింపు వేగంతో అవతలికి వెళ్ళిపోతున్నాడు అతను. అరచేత్తో దాని వెన్ను మీద తట్టి దాన్ని మరింతగా రెచ్చగొడుతున్నాడు.

అలుపు వచ్చేసింది దూడకి. అణిగిపోయింది దాని ఆగ్రహం. ఆఖరి సారిగా ఒక చిన్న బుస కొట్టి పాకలోకి పారిపోయింది. అరుగు మీద రేవంతుడి సతీమణిని గమనించి చిన్నగా నవ్వాడు భార్గవుడు.

"కోపం ఎక్కువైపోవడం వల్ల దానికి ఆలోచన లోపించింది. గంతులు వేయకుండా ఒక్క క్షణం పాటు కుదురుగా నిలబడి తలను విసిరితే నేను దొరికిపోయి ఉండేవాడిని" అన్నాడు.

Actual Post by Voice of Maheedhar

Monday, December 2, 2024

'STAR FIGHTER (Fighting Fool) - స్టార్ ఫైటర్' Madhu Babu Shadow Past Life Novel


 రేపే '03/12/2024' ప్రారంభం.. ‪

మధుబాబు గారి షాడో Past Life Adventure - 'స్టార్ ఫైటర్' అనబడే ఫైటింగ్ ఫూల్.. మహీధర్

Playlist: https://www.youtube.com/playlist?list=PLH8sKIJ0wgDfeZ0il9PerRjfrC0kXc7d5

ALSO CHECK

Wednesday, November 27, 2024

'STAR FIGHTER (Fighting Fool) - స్టార్ ఫైటర్' Madhu Babu Shadow Past Life Novel

 

వచ్చే మంగళవారం '03/12/2024' న ప్రారంభం.. ‪@ShadowMB‬ 

మధుబాబు గారి షాడో Past Life Adventure - 'స్టార్ ఫైటర్' అనబడే ఫైటింగ్ ఫూల్.. మహీధర్

Playlist: https://www.youtube.com/playlist?list=PLH8sKIJ0wgDfeZ0il9PerRjfrC0kXc7d5

ALSO CHECK

'ATHANU - అతను' Madhu Babu Socio Family Drama Novel


'BABA - బాబా' Madhu Babu Shadow Past Life Novel


Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

COUNTER


View My Stats